Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్‌లో కేకేఆర్!
- విరాట్ కోహ్లీ సరికొత్త ఘనత
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా కోహ్లీ
- సీఎస్కే, ఎంఐ కాదు టాప్‌లో కేకేఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Becomes Highest-Earning Player In IPL History: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సరికొత్త ఘనత అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ప్రముఖ సంస్థలు ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు ఏకంగా రూ. 230 కోట్ల ఆదాయాన్ని విరాట్ ఆర్జించాడు. లీగ్ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకు కోహ్లీ ఒకే ఒక్క ఫ్రాంచైజీకి ఆడాడు. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే కింగ్ ప్రాతినిధ్యం వహించడం విశేషం.
విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక సంపాదన కలిగిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. రోహిత్ రూ. 227.2 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలవగా.. ధోనీ రూ. 200 కోట్ల ఆదాయంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లోని మొత్తం 10 ఫ్రాంచైజీల ఉమ్మడి మార్కెట్ విలువ అక్షరాలా రూ. 1.63 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సహ-యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అన్నిటికంటే అత్యధిక విలువైన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.19,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. మార్కెట్ విలువలో కోల్‌కతా తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నిలిచాయి. ఈ రెండు విజయవంతమైన ఫ్రాంచైజీలు చెరో రూ.18,400 కోట్ల విలువతో సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!