Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
- వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా ఆర్సీబీ
- ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర
- విరాట్ కోహ్లీపై వెంకటేశ్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s Winning Formula: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. 2026లో కూడా ట్రోఫీని నిలబెట్టుకుంది. ఆర్సీబీ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌ను ముగించాడు.
ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీపై ఆర్సీబీ జట్టు సహచరుడు వెంకటేశ్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లీ చూపించే తీవ్రత, పరుగుల దాహం, నాయకత్వ లక్షణాలే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయని పేర్కొన్నాడు. ఈ సీజన్లో కోహ్లీతో కలిసి ఆడిన వెంకటేశ్.. అతని ప్రభావాన్ని దగ్గరగా చూసిన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘విరాట్ తన జట్టు ఓడిపోవడం చూడాలనుకోడు. ఆ తపనే మొత్తం జట్టును ముందుకు నడిపిస్తుంది. మీరు కోహ్లీతో కలిసి మైదానంలో ఉంటే తల వంచుకుని తిరగలేరు, అలసత్వంగా నడవలేరు. ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా అతడు చూపించే తీవ్రత అసాధారణం. అలాంటి ఆటగాడి ముందు నిర్లక్ష్యంగా ఉండలేము’ అని వెంకటేశ్ అన్నాడు.
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
ఫైనల్లో ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ దూకుడుగా ఆడారు. ఇద్దరూ కలిసి 4.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. అయితే వెంటనే రెండు వికెట్లు కోల్పోయి జట్టు 63/2తో జట్టు కష్టాల్లో పడిపోయింది. అయినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి ఆందోళన లేదని వెంకటేశ్ వెల్లడించాడు. ‘మేమంతా ప్రశాంతంగానే ఉన్నాం. ఎందుకంటే విరాట్ ఇంకా క్రీజులో ఉన్నాడు. అతని ఉనికే జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా అతడు సంపాదించుకున్న గౌరవం అది. కోహ్లీ మైదానంలో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ముందుగా మానసిక పోరాటమే మొదలవుతుంది’ అని చెప్పాడు. కోహ్లీ విజయాల వెనుక కేవలం ప్రతిభ మాత్రమే కాదని, ప్రతి విషయంలో అతనికి ఒక స్పష్టమైన విధానం ఉంటుందని వివరించాడు. ‘కోహ్లీ ప్రాక్టీస్‌కు ఒక పద్ధతి ఉంటుంది. మ్యాచ్‌ను ఎదుర్కొనే విధానానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి క్షణం అతడు అధిక శక్తితో ఆడతాడు. ఇది సహజంగా వచ్చేది కాదు, నిరంతర కృషి ఫలితం’ అని వెంకీ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడకపోయినా, అతడిని గమనించడం ద్వారానే చాలా విషయాలు నేర్చుకుంటానని వెంకటేశ్ చెప్పాడు. ముఖ్యంగా బౌలర్ల ఆలోచనలను ముందుగానే అర్థం చేసుకోవడం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకోవడం వంటి అంశాలు తనకు స్ఫూర్తినిస్తాయని తెలిపాడు. ‘కోహ్లీని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిపై పూర్తి స్పష్టత ఉండాలి. అది డిఫెన్స్ అయినా సరే, అటాక్ అయినా సరే. మీ లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా ఉంటే పని సగం పూర్తయినట్టే. అదే విరాట్ కోహ్లీ విజయ రహస్యం’ అని వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!