Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్.. 25 బంతుల్లోనే సెంచరీ.. వీడియో వైరల్!
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్
- 25 బంతుల్లోనే సెంచరీ చేసిన బుడ్డోడు
- పీటర్సన్ ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్న వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi 25 Ball Century: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ షోలో సరికొత్త రికార్డు సృష్టించాడు. పీటర్సన్ నిర్వహించిన ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్న వైభవ్.. కేవలం 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుడ్డోడి బ్యాటింగ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
కెవిన్ పీటర్సన్ తన షోలో వైభవ్ సూర్యవంశీకి 50 బంతుల్లో 100 పరుగులు చేయాలని ఛాలెంజ్ విసిరాడు. అయితే బుడ్డోడు ఆ ఛాలెంజ్‌ను చాలా ఈజీగా తీసుకుని.. కేవలం 25 బంతుల్లోనే శతకం బాదేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు బాదుతూ కేపీని షాక్‌కు గురిచేశాడు. వైభవ్ క్యాచ్ పడితే.. వెయ్యి డాలర్లు ఇస్తామని ఫీల్డర్లకు పీటర్సన్ నజరానా ప్రకటించాడు. అయితే ఒక్కరు కూడా ఆ ఆఫర్‌ను వినియోగించుకోలేకపోయారు. ఓ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. వైభవ్ విధ్వంసంకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన వెంటనే పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేశాడు.
Also Read
- Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
- Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర!
- Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
- IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
అయితే శ్రేయస్ అయ్యర్ రికార్డును మాత్రం వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టలేకపోయాడు. గతంలో ఇదే షోలో పాల్గొన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్.. కేవలం 22 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. పీటర్సన్ షో చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇప్పటికీ అయ్యర్ పేరిటే కొనసాగుతోంది. వైభవ్ కేవలం మూడు బంతుల తేడాతో ఆ రికార్డును చేజార్చుకున్నాడు. ఈ షోలో భాగంగా పీటర్సన్ మాట్లాడుతూ.. ‘శ్రేయస్ రికార్డును బ్రేక్ చేస్తావా? అని అడగగా’, ఖచ్చితంగా బ్రేక్ చేస్తా అని వైభవ్ చెప్పాడు. కానీ చివరికి మూడు బంతుల తేడాతో ఆ ఘనతను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ పీటర్సన్ షోలో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ 28 బంతుల్లో సెంచరీ చేయగా.. ఏబీ డివిలియర్స్ 30 బంతులు తీసుకున్నాడు. యశస్వీ జైస్వాల్‌కు సెంచరీ పూర్తి చేయడానికి 47 బంతులు కావాల్సి వచ్చింది.
ఇక ఈ ఎపిసోడ్లో వైభవ్ సూర్యవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. టీ20 క్రికెట్లో డబుల్ సెంచరీ చేయాలని తన లక్ష్యమని తెలిపాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గేల్.. పుణె వారియర్స్‌పై 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ రికార్డును బద్దలు కొడతానని వైభవ్ చెప్పుకొచ్చాడు. ‘టీ20ల్లో 200 పరుగులు చేయాలని ఉంది. క్రిస్ గేల్ 175 చేశాడని తెలుసు. ఆ రికార్డును నేను తప్పకుండా బ్రేక్ చేస్తా. మ్యాచ్‌లో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఖచ్చితంగా 200 పరుగులు సాధిస్తా’ అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఐపీఎల్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన ఈ బుడ్డోడు.. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు బద్దలు కొట్టడం పక్కా.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్.. 25 బంతుల్లోనే సెంచరీ.. వీడియో వైరల్!
-
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
-
Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
-
YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
-
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!