GT vs RR Qualifier 2: లగే రహో బేటా.. వైభవ్ సూర్యవంశీకి గవాస్కర్ ప్రత్యేక సందేశం!
- ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ
- బుడ్డోడి సునీల్ గవాస్కర్ ఆశీర్వాదాలు
- లగే రహో బేటా లగే రహో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతీయ సంస్కృతిలో పెద్దలకు గౌరవం తెలుపుతూ కాళ్లు మొక్కడం సంప్రదాయం. వైభవ్ సూర్యవంశీ కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ముల్లాన్‌పూర్ మైదానంలో ప్రీ-మ్యాచ్ షో చేస్తున్న సునీల్ గవాస్కర్ వద్దకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కాడు. ఈ ఘటన అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం ఈ విషయంపై స్పందించిన గవాస్కర్.. వైభవ్‌కు తనతో చెప్పిన వ్యాఖ్యలు వెల్లడించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌కు ముందు వైభవ్ వచ్చి నా కాళ్లు మొక్కాడు. అప్పుడు నేను అతడికి ఒక్క మాటే చెప్పాను.. లగే రహో బేటా లగే రహో (ఇదే జోరు కొనసాగించు). నేను అతడితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నా కూడా ఇదే చెప్పేవాడిని’ అని అన్నాడు. గవాస్కర్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
వైభవ్ సూర్యవంశీపై గవాస్కర్ ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన గవాస్కర్.. ‘2026 సంవత్సరం వైభవ్ సూర్యవంశీ ఏడాదిగా గుర్తుండిపోతుంది’ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఈ యువ బ్యాటర్‌ను త్వరలోనే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని కూడా సూచించాడు. ‘ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయాలి. ఇంత అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత అవకాశం ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు?’ అని ప్రశ్నించాడు.
వైభవ్ వయసు గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అతడి వయసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అతడు తనకంటే 15 ఏళ్లు ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లపై సిక్సర్లు కొడుతున్నాడు. అతడి నిర్భయమైన ఆట తీరు అద్భుతం’ అని ప్రశంసించాడు. ప్రస్తుతం వైభవ్ ఆట చూస్తుంటే.. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వైభవ్‌ను భారత టీ20 జట్టులోకి తీసుకోవాలంటే ప్రస్తుత ఓపెనర్లలో ఎవరికైనా చోటు కోల్పోవాల్సి రావొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లో ఒకరిని తప్పించాల్సి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ వైభవ్ ప్రస్తుతం చూపిస్తున్న ఫామ్, దూకుడు చూస్తుంటే.. అతడు త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!