NTV Telugu Site icon

T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో

India Team New

India Team New

Hero Sarath Kumar on T20 World Cup 2024 India Squad: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి బుధవారం (మే 1) తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో తీవ్ర పోటీ ఉన్న కారణంగా కొందరు స్టార్ ఆటగాళ్లకు కూడా చోటు దక్కలేదు. శుభ్‌మ‌న్ గిల్, కేఎల్ రాహుల్‌, రింకూ సింగ్, టీ నటరాజన్ లాంటి వారికి నిరాశ తప్పలేదు.

టీ20 ప్రపంచకప్‌ 2024కు ఎంపికైన భారత జట్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ తమ అభిప్రాయాలను, అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌ జట్టులో తమిళ పేర్లు లేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్, తమిళనాడు క్రికెటర్ తంగరసు నటరాజన్‌ ఎంపికపై పునరాలోచించాలని శరత్ కుమార్ పేర్కొన్నారు. మే 15 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.. 300 స్కోర్ కొడుతాం!

‘భారత్, భారత జట్టు అంటే నాకు చాలా ఇష్టం. మ్యాచ్ ఉందంటే నేను ఉత్సాహంగా ఉంటాను. అయితే టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తమిళ పేర్లు కనిపించకపోవడంతో కొంత నిరాశ చెందాను. వ్యక్తిగతంగా టీ నటరాజన్ బౌలింగ్ నాకు చాలా ఇష్టం. డెత్‌ఓవర్లలో అద్భుత యార్కర్లతో ప్రత్యర్థిని నిలువరిస్తాడు. నటరాజన్‌ను జట్టులోకి తీసుకునేందుకు బీసీసీఐ సెలక్టర్లు పునరాలోచించాలి’ అని శరత్ కుమార్ తన ఎక్స్‌లో రాసుకొచ్చారు. తమిళ పేర్లు ఉండాలని శరత్ కుమార్ ప్రాంతీయ అభిమానాన్ని వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో నటరాజన్‌ జట్టుకు ఆడని విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో నట్టు 13 వికెట్స్ పడగొట్టాడు.

Show comments