SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav to miss IPL 2024 SRH vs MI Match: బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదని తెలుస్తోంది. దాంతో గుజరాత్ మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం.
సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండేది లేనిది మంగళవారం సాయంత్రం లోగా తెలియరానుంది. సాయంత్రం లోగా సూర్యకు ఎన్‌సీఏ ఎన్‌ఓసీ ఇవ్వకపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు మిస్టర్ 360 అందుబాటులో ఉండడం దాదాపుగా అసాధ్యమే. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతడు ఉండివుంటే ముంబై సునాయాసంగా గెలిచేది. రేపటి మ్యాచ్‌కు కూడా అతడు దూరమైతే.. ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: IPL 2024: ఆర్‌సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!
సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్య ఎన్‌సీఏ వైద్య బృదం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు ఐపీఎల్ ఆడాలంటే ఎన్‌సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్‌ఓసీ ఇస్తేనే ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య.. 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా ఏళ్లుగా ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!