Suryakumar Yadav: ముంబై జట్టులోకి సూర్య భాయ్ ఎంట్రీ.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2024లోకి అడుగు పెట్టాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య భాయ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. అయితే, శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్య అదే రోజు ప్రాక్టీస్‌ను కూడా స్టార్ట్ చేశాడు. కాబట్టి, నెక్ట్స్ మ్యాచ్‌లో ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటాడని చెప్పొచ్చు. వరుసగా మూడు పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ టీమ్ కు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే, గత మూడు మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
Read Also: US-Iran: ఇజ్రాయిల్‌పై దాడికి కౌంట్‌డౌన్.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే, ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రాకతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ బలం పెరిగిపోయింది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ఇక, నుంచి భీకర బ్యాటింగ్‌ను చూడొచ్చు.. ముంబై తరపున 85 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య కుమార్ 2688 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 20 హాప్ సెంచరీలు ఉన్నాయి. అంతే కాకుండా ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడుగా సూర్య కొనసాగుతున్నాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ తో రేపు ( ఆదివారం ) జరిగే మ్యాచ్‌లోనైనా ముంబై ఇండియన్స్ విజయాల ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!