Site icon NTV Telugu

Suryakumar Yadav: టీ20 మొనగాడు.. ముంబై ఇండియన్స్ కి నేనున్నాను..

Sky

Sky

Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసి రాబిన్ ఉతప్ప రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రాబిన్ ఉతప్ప 10 ఇన్నింగ్స్‌లలో 25 కంటే ఎక్కువ పరుగులు చేసి ఈ ఘనత సాదించాడు. తాజాగా సూర్య ఆ రికార్డును అధిగమించాడు. ఈ ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 29, 48, 27, 67, 28, 40, 26, 68, 40, 54, 48 పరుగులు చేశాడు. సూర్య ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ల కారణంగానే ముంబై ఈ రోజు టేబుల్ టాప్ లో కొనసాగుతుంది.

Read Also: IPL 2025: వాళ్లు ఐపీఎల్ అంపైర్స్ కాదు.. ముంబై అంపైర్స్!

ఇక, దీంతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఇప్పటి వరకు సూర్య 11 మ్యాచ్‌ల్లో 475 పరుగులు చేశాడు. అదే సమయంలో సాయి సుదర్శన్ 9 మ్యాచ్‌ల్లో 456 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 443 పరుగులు కొట్టాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీ 6 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Read Also: Virat Kohli: కోహ్లీని పక్కన పెట్టిన ఢిల్లీ.. అసలు విషయం బయట పెట్టిన సెహ్వాగ్..

అయితే, ఇదిలా ఉంటె ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా పుంజుకుంది. ఒక్కో మ్యాచ్ లో ప్రత్యర్థి జట్లను మట్టి కరిపిస్తూ పాయింట్స్ టేబుల్ లో ఆధిపత్యం కొనసాగిస్తుంది. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ముంబైకి కలిసొచ్చింది. ఆరంభంలో రోహిత్, రియాన్ రికెల్టన్ చెలరేగుతుండగా సూర్య మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి పరుగుల వరద పారిస్తున్నాడు, ఫలితంగా హార్దిక్ నేతృత్వంలో ముంబైకి తిరుగు లేకుండా పోతుంది.

Exit mobile version