SRH vs DC: గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 18వ సీజన్‌లో మాత్రం తమ ప్రస్థానం తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. నేటి మ్యాచ్ ఫలితంతో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఈరోజు ( మే 5న) ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ని హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఖాతాలో 3 విజయాలతో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 మ్యాచ్ లు గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి.
Read Also: Pooja hegde : వరుసగా 7 ఫ్లాప్ లు పాపం ఇప్పుడు పూజ పరిస్థితి ఏంటీ..
అయితే, ఇతర జట్ల రన్ రేట్ ను బట్టి ప్లేఆఫ్స్ ఆశలు పెట్టుకోవచ్చు ఎస్ఆర్హెచ్. కానీ, నేటి మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి హైదరాబాద్ జట్టు నిష్క్రమిస్తుంది. మరోవైపు ఢిల్లీ కూడా తమ ప్రయాణం తడబడుతుది. తొలి 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి ఘనంగా ప్రారంభించిన.. ఆ తర్వాతి 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. కానీ, డీసీ పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఢిల్లీ మరింత మెరుగైన స్థితికి చేరుకోనుంది.
Read Also: Kanpur: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 5 మందికి తీవ్ర గాయాలు
ఇక, గుజరాత్ చేతిలో ఓడిన తర్వాత సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలహీనత మరోసారి బయటపడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా అందరూ విఫలమయ్యారు. మిగతా ప్రధాన బ్యాటర్లు విఫలం కావడం.. జట్టుతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న హెడ్, క్లాసెన్ పేలవంగా ఆడిటం.. ఇషాన్ కిషన్ ప్రతీ పరుగు కోసం తీవ్రంగా కష్టపడటంతో.. టాప్–4 ఇలా ఆడితే ఏ జట్టైనా విజయాన్ని ఆశించదు. ఆరంభ మ్యాచ్‌లలో కనిపించిన పట్టుదలను అనికేత్ వర్మ కొనసాగించలేకపోయాడు. అయితే, హోం గ్రౌండ్‌లోనైనా వీరంతా తమ బ్యాటింగ్‌కు పదును పెడితే భారీ స్కోరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక, బ్యాటింగ్ కంటే చెత్త బౌలింగ్ సన్ రైజర్స్‌ను వెనకబడేలా చేస్తుంది. ప్రధాన బౌలర్లు మహ్మద్ షమీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, అన్సారీ భారీగా పరుగులు ఇస్తుంటే ఏ జట్టైనా ఏం చేయగలదు. వీరిలో ఒక్కరు అయినా బౌలింగ్ బాగా వేసి ఉంటే ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లోనైనా బౌలర్ల ఆటతీరు మారితే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంపై నమ్మకం పెట్టుకోవచ్చు.
Read Also: Hyderabad: యజమాని మర్మాంగాలపై పెంపుడు కుక్క దాడి.. తీవ్ర రక్తస్రావంతో మృతి!
కాగా, ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఢిల్లీపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 266 పరుగులు కాగా.. అత్యల్ప స్కోరు 116. హైదరాబాద్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 రన్స్ కాగా.. అత్యల్ప స్కోరు 80 పరుగులు. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూద్దాం..
