Site icon NTV Telugu

DC vs SRH: సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. ఢిల్లీ విక్టరీ

Dc Won

Dc Won

ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా చెలరేగాడు. 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 18 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ 15 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌లో జీసాన్ అంసారీ ఒక్కడే 3 వికెట్లు తీయగలిగాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

Read Also: Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. ఆ రోజే ఆర్య-2 రీ రిలీజ్..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరచడంతో హైదరాబాద్ బ్యాటింగ్ విఫలమైంది. మ్యాచ్ ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. అనికేత్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ 163 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (1) మరోసారి విఫలమయ్యాడు. ట్రావిస్ హెడ్ (22) పర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0) నిరాశపరిచారు. యువ ఆటగాడు అనికేత్ వర్మ (74) అద్భుతంగా రాణించాడు. కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 180.48 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (32) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 3.. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.

Read Also: Bandi Sanjay: ఎంఐఎంను గెలిపించడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు..

Exit mobile version