చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టిరాల్‌ను పెంచుతాయి.

చింత చిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే.. గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. 

చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైల్స్ ఉన్న వారికి ఇది నివారణగా ఉపయోగపడుతుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.

చింత చిగురులో ఉండే పోషకాలు.. గుండె జబ్బులు దరి చేరకుండా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు.. చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 

తరచూ చింత చిగురును తీసుకుంటే.. శరీరంలోని ఎముకలు ధృఢంగా తయారవుతాయి.

షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే.. రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గుతూ వస్తాయి.

ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింత చిగురు క్రమంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కంటి సంబంధ సమస్యలను నివారించడంలోనూ చింత చిగురు సహాయపడుతుంది.