Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026, 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 22 బంతుల్లో 62 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన స్టోయినిస్, చివరి ఓవర్‌లో 24 పరుగులు (4, 6, 6, 4, 4) రాబట్టి గ్రౌండ్ ను షేక్ చేశాడు. ముల్లన్‌పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినిస్, మైదానంలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం (50) సాధించి 22 బంతుల్లోనే 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 281.82. చివరి రెండు ఓవర్లలో పంజాబ్ 41 పరుగులు రాబట్టగా, ఒక్క 20వ ఓవర్‌లోనే బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో స్టోయినిస్ 24 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ 222/4 భారీ స్కోరు నమోదు చేసింది.
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 20వ ఓవర్‌లో (కనీసం 100 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో) అత్యధిక స్ట్రైక్ రేట్‌తో రోహిత్ శర్మను అధిగమించాడు. అంతకుముందు రోహిత్ శర్మ 20వ ఓవర్‌లో 282.42 స్ట్రైక్ రేట్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స్టోయినిస్ ఇప్పుడు దానిని 297.62కి అప్‌డేట్ చేశాడు. డెత్ ఓవర్లలో (16-20) కూడా స్టోయినిస్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో స్టోయినిస్ 179 బంతులు ఎదుర్కొని 458 పరుగులు (స్ట్రైక్ రేట్ 255.86) చేశాడు. ఈ కాలంలోనే 43 ఫోర్లు, 35 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్‌లో స్టోయినిస్‌కు ఇది మొదటి అర్ధశతకం కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఇది 10వ అర్ధశతకం. చివరి ఓవర్లలో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్‌డేట్..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!