Kavya Maran: ఎగిరి గంతేసిన కావ్య మారన్.. క్యూట్ సెలబ్రేషన్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ ఓనర్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ, సహా యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి బంతి అనంతరం ఎగిరి గంతేసి సంబరాలు చేసుకున్నారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆనందం పంచుకున్నారు. ఆపై పక్కనున్న వారితో కలిసి ఆమె సంతోషంలో మునిగితేలారు. కీలక మ్యాచ్‌లో కావ్య తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారు. కావ్యకు సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Lakshmi Manchu-Kannappa: ‘కన్నప్ప’లో నటించడం లేదు.. విష్ణు అవకాశం ఇవ్వలేదు!
వేలంలో కావ్య మారన్ అనుసరించిన వ్యూహాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు కీలక మార్పులు చేశారు. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరిని హెడ్ కోచ్‌గా కావ్య నియమించారు. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ 2023ని అందించిన ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేశారు. అతడిపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు అప్పగించారు. కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చి పటిష్టం చేశారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇక ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలని, కావ్య పాప మోహంలో సంతోషం అలానే ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY
— JioCinema (@JioCinema) May 24, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు