Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
- గుజరాత్ తరఫున కాగిసో రబాడ అద్భుత ప్రదర్శన
- ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 3 కీలక వికెట్లు
- ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kagiso Rabada Reacts After GT’s Dominant Win Over SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కాగిసో రబాడ మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రబడాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రబడా.. తన బౌలింగ్, పిచ్ పరిస్థితులు, డ్రాప్ క్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ ఆరంభంలోనే కీలక క్యాచ్‌ను వదిలేయడంపై రబాడ స్పందిస్తూ.. ‘ఆ బంతి స్పీడ్‌ను నేను సరిగా అంచనా వేయలేకపోయాను. అందుకే వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. అది చాలా కీలకమైన వికెట్. అప్పటికే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మూడో వికెట్ పడితే.. మాకు ఇంకా ప్రయోజనం ఉండేది. అయితే అదృష్టవశాత్తూ తర్వాత వికెట్ పడింది’ అని చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్లో తాను జట్టుకోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు. ‘నేను ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను. ఈ జట్టులో నా పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పడంతో పాటు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే నేను మైదానంలో వంద శాతం కష్టపడుతున్నా’ అని పేర్కొన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
బౌలర్లకు రిథమ్ ఎంత ముఖ్యమో కూడా రబాడ వివరించాడు. ‘రిథమ్ అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా బౌలింగ్ చేయడం అవసరం. అదే సమయంలో మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండేలా శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. సరైన రిథమ్ దొరికితేనే బౌలర్‌గా పూర్తి స్థాయిలో ప్రభావం చూపగలుగుతాం’ అని చెప్పాడు. పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ చేయడమే తమ విజయ రహస్యమని వెల్లడించాడు. ‘ముందుగా పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. ప్రతి బౌలర్‌కు ప్రత్యేకమైన బలం ఉంటుంది. ఆ బలాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో చూడాలి. ఒక ప్లాన్ పనిచేయకపోతే.. మరో ప్లాన్‌కు మారాలి. మేము అదే ప్రయత్నించాం’ అని రబాడ తెలిపాడు.
అహ్మదాబాద్ పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బౌలింగ్ కీలకమైందని రబాడ స్పష్టం చేశాడు. ‘ఈ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మొదట చూపించారు. ఆ తర్వాత మేము అదే ప్లాన్‌ను ఇంకా మెరుగ్గా అమలు చేయడానికి మేము ప్రయత్నించాం. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ మరింత కఠినంగా మారింది. బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సహనం, సింపుల్ బౌలింగ్ మాకు బాగా ఉపయోగపడింది’ అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!