NTV Telugu Site icon

SRH vs RCB: ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్‌పై వేటు!

Srh 1

Srh 1

SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్‌సీబీ 262 పరుగులు చేసి ఓడింది. దాంతో ఈరోజు ఉప్పల్ మైదానంలో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఓసారి చూద్దాం.

ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. పవర్‌ ప్లేలో బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్‌ రెడ్డి చెలరేగిపోతున్నారు. ఐడెన్ మార్‌క్రమ్‌, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్లు నమోదు చేస్తుంది. బ్యాటింగ్ విభాగం మరోసారి చెలరేగాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.

ఈ సీజన్‌లో వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. అయితే అతడు ఆశించిన ప్రదర్శన చేయలేదు. చివరగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలోనే 46 పరుగులు ఇచ్చాడు. దీంతో సుందర్‌పై వేటు వేసి జయదేవ్ ఉనద్కత్‌ లేదా ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ మొదట బౌలింగ్ చేస్తే.. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టులో మార్పులు దాదాపుగా ఉండవు.

Also Read: SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్‌.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్.