SRH vs RCB: ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్‌పై వేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్‌సీబీ 262 పరుగులు చేసి ఓడింది. దాంతో ఈరోజు ఉప్పల్ మైదానంలో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఓసారి చూద్దాం.
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. పవర్ ప్లేలో బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి చెలరేగిపోతున్నారు. ఐడెన్ మార్‌క్రమ్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్లు నమోదు చేస్తుంది. బ్యాటింగ్ విభాగం మరోసారి చెలరేగాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఈ సీజన్‌లో వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. అయితే అతడు ఆశించిన ప్రదర్శన చేయలేదు. చివరగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలోనే 46 పరుగులు ఇచ్చాడు. దీంతో సుందర్‌పై వేటు వేసి జయదేవ్ ఉనద్కత్ లేదా ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ మొదట బౌలింగ్ చేస్తే.. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టులో మార్పులు దాదాపుగా ఉండవు.
Also Read: SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!
ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!