Shreyas Iyer Captaincy Record: సాధారణ జట్లను సూపర్ టీంలుగా మార్చిన నాయకుడు.. నువ్వు ఉండాలి సామీ!
- కెప్టెన్సీ ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రేయస్ అయ్యర్
- నాలుగు సార్లు ప్లేఆఫ్స్, మూడు సార్లు ఫైనల్
- శ్రేయస్ విజయం శాతం 59.30
- సాధారణ జట్లను సూపర్ టీంలుగా మార్చిన శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Captaincy Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్సీ అనేది ఒక కళ. మెగా లీగ్‌లో అద్భుత జట్టును విజయవంతంగా నడిపించడం సాధారణ విషయమే. అయితే సాధారణ స్థాయిలో ఉన్న జట్టును ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అతడి కెప్టెన్సీ రికార్డులు చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఎంత ప్రభావం చూపాడో ఇట్టే అర్థమవుతుంది.
శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఐదు సీజన్లలో కెప్టెన్‌గా చేశాడు. ఈ ఐదు సీజన్లలో అతడు సారథ్యం వహించిన టీమ్స్.. నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరడం అతడి కెప్టెన్సీ స్థిరత్వానికి నిదర్శనం. అంతేకాకుండా మూడు సార్లు ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లి.. ఒకసారి టైటిల్ గెలిపించాడు. ఇది అతడి నాయకత్వ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొత్తం మీద శ్రేయస్ విజయం శాతం 59.30గా ఉండటం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డులలో ఒకటి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ జట్లకు సారథ్యం వహించి శ్రేయస్ అయ్యర్ ఈ విజయాలు అందుకున్నాడు. అతడు కెప్టెన్సీ చేపట్టే ముందు కొన్ని జట్లు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ జట్టు ఎనిమిదేళ్లుగా ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. అయితే శ్రేయస్ నాయకత్వంలో ఢిల్లీ కొత్త ఊపిరి పొంది ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్ దాదాపు పది సంవత్సరాల పాటు ప్లేఆఫ్స్ ముఖం చూడలేదు. అలాంటి జట్టు తల రాతను శ్రేయాస్ ఒక్క సీజన్‌లోనే మార్చి.. పోటీదారుగా మార్చాడు. ఒత్తిడిలో ఉన్న జట్లను విజయపథంలో నడిపించడం అతడి కెప్టెన్సీని ఉన్నత స్థానంలో నిలిపింది.
అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కూడా గొప్ప విషయం. ప్రతి జట్టులోని ఆటగాళ్లతో కలిసిపోవడం, వారి బలాబలాలను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు అతడిని ప్రత్యేక నాయకుడిగా నిలబెడుతున్నాయి. భవిష్యత్తులో టీమిండియా వైట్ బాల్ క్రికెట్, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడి నాయకత్వం, స్థిరత్వం, ఆటపై అవగాహన చూస్తుంటే.. భారత జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం అతడికి ఉందని చెప్పడంలో సందేహం లేదు.
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!