NTV Telugu Site icon

Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!

Nitish Reddy Sixes

Nitish Reddy Sixes

Nitish Reddy Equals Travis Head, Heinrich Klaasen Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌పై 8 సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సరసన నితీష్ నిలిచాడు. 2017లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై వార్నర్ ఎనిమిది సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో దేవ్ భాయ్ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాయల్స్‌పై నితీష్ 42 బంతుల్లో 74 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

మనీష్ పాండే, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ కూడా ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదారు. 2020లో రాజస్థాన్ రాయల్స్‌పై మనీష్, ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై క్లాసెన్, ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హెడ్ ఎనిమిది సిక్సర్లు చొప్పున బాదారు. తాజాగా వీరి సరనస నితీష్ రెడ్డి నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ పడినా.. నితీష్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read: Suresh Raina: ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం!

ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. 2013లో చిన్నస్వామి స్టేడియంలో పూణె వారియర్స్ ఇండియాపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గేల్ 17 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెకల్లమ్ (13), క్రిస్ గేల్ (13), క్రిస్ గేల్ (12), ఏబీ డివిలియర్స్ (12) టాప్ 5లో ఉన్నారు. ఇక ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 33 సిక్సర్లు నమోదయ్యాయి. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సిక్సులు నమోదయ్యాయి.