SHR vs RR: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్ అడ్డుకునేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Playoff Chances: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. ఓ ప్లేస్ రాజస్థాన్ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది.
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 నెగ్గి.. 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్త్ ఇప్పటికే దాదాపుగా ఖరారు అయింది. మిగిలిన 5 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. సన్‌రైజర్స్‌పై గెలిచి అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలని చూస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
వరుసగా నాలుగు విజయాలు, రికార్డు స్కోర్లతో ఐపీఎల్ 2024లో జోష్ తీసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. దాంతో సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 5 గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తేనే ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో మెరుగైన స్థితిలో నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అయితే వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్‌ను సన్‌రైజర్స్ ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!