Site icon NTV Telugu

Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్‌!

Sanju

Sanju

Sanju Samson: ఐపీఎల్‌ 2025 సీజన్‌ ముగిసి కొన్ని రోజులే అవుతుంది. ఇక, తదుపరి సీజన్‌పై చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ సారథిగా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్రేడింగ్‌ విండో ఆప్షన్‌ ద్వారా తీసుకుంటుందనే ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే, ఈ అంశంపై అటు సంజూ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. అయినా సంజూ సీఎస్‌కేలో చేరతాడనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయింది. మరవైపు, సంజూకు సంబంధించి మరో ప్రచారం తాజాగా మొదలైంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు శాంసన్ ఆడబోతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్‌ స్కౌటింగ్‌ హెడ్‌ బిజూ జార్జ్‌ హింట్ ఇచ్చాడు. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌లో సంజూతో చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో దర్శనమిస్తుంది. ఈ ఫోటోకు బిజూ కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవిగా ఉండిపోతాయని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Read Also: Ramchander Rao: ఎస్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్ వారితో కుమ్మకైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాట్ కామెంట్స్..!

ఇక, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) స్కౌటింగ్ హెడ్‌ బిజు జార్జ్‌ పోస్టును చూసి నెటిజన్లు సంజూ శాంసన్ కోసం కేకేఆర్‌ ప్లాన్ సిద్ధం చేస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్‌ కోసం వికెట్‌ కీపర్‌తో పాటు కెప్టెన్‌ కావాల్సి ఉంది. సంజూ శాంసన్‌ ఈ రెండు పాత్రలకు తగిన న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం అనుకుంటుందని టాక్. గత సీజన్‌లో కేకేఆర్‌ అజింక్య రహానే కెప్టెన్సీలో పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది.

Read Also: Minister Nara Lokesh: పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!

దీంతో సంజూ శాంసన్‌ లాంటి కెప్టెన్ తమ జట్టులోకి వస్తే జట్టు కష్టాలు తీరుస్తాడని కేకేఆర్‌ అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అయితే, ఎలాగూ ట్రేడింగ్‌ విండో ఆప్షన్‌ ఉండటంతో.. అతడి కోసం కేకేఆర్‌ ఎంత డబ్బైనా పెట్టే అవకాశం ఉంది. ఏం జరుగుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇక, సంజూ శాంసన్‌ 2013లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తన జర్నీని స్టార్ట్ చేశాడు. అతి కొద్ది కాలంలో ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ సస్పెండ్‌తో శాంసన్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు వెళ్లి.. 2018లో అతడు తిరిగి రాయల్స్‌ గూటికి చేరుకున్నాడు. అలాగే, 2021 సీజన్‌లో శాంసన్‌ రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో 2022 సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తాజాగా ముగిసిన సీజన్‌లో శాంసన్‌ గాయంతో పెద్దగా టోర్నోలో కనిపించలేదు. అతని ప్లేస్ లో రియాన్‌ పరాగ్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు.

Exit mobile version