సంజూకు సంబంధించి మరో ప్రచారం తాజాగా మొదలైంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు శాంసన్ ఆడబోతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ హింట్ ఇచ్చాడు. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌లో సంజూతో చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో దర్శనమిస్తుంది. ఈ ఫోటోకు బిజూ కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవిగా ఉండిపోతాయని క్యాప్షన్ ఇచ్చాడు.