Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
- చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి
- జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎస్కే కెప్టెన్
- వచ్చే ఏడాది మరింత బలంగా వస్తామంటున్న రుతురాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Ruturaj Gaikwad on CSK Defeat vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం రాత్రి చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో సీఎస్కే చివరి వరకు పోరాడిందని, మ్యాచ్ 18వ ఓవర్ వరకు చెన్నై గెలుపు రేసులోనే ఉందని పేర్కొన్నాడు. 180 పరుగులు ఈ పిచ్‌పై సరైన స్కోరేనని అభిప్రాయపడిన రుతురాజ్.. కొన్ని కీలక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ఎంతో గర్వంగా ఉందని, వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం అని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘ఇది మంచి టీ20 మ్యాచ్. ఇరి జట్ల మధ్య చివరి వరకు పోటీ కొనసాగింది. మ్యాచ్‌లో పిచ్ ఒకేలా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 180 పరుగులు ఛేజ్ చేయగలిగే స్కోరే. మేము కొన్ని చిన్న అవకాశాలను కోల్పోయాం. కానీ మా ఆటగాళ్ల ప్రతిభపై నాకు గర్వంగా ఉంది. వికెట్ తీసిన వెంటనే ఒత్తిడి పెంచాలి, మేము అది చేయలేకపోయాం. ప్రత్యర్థి వికెట్ కోల్పోయిన వెంటనే మరో వికెట్ కోసం ఒత్తిడి సృష్టించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో కొద్దిగా వెనుకబడ్డాం. అయినప్పటికీ మాకు అందుబాటులో ఉన్న జట్టుతో, పరిమిత ఎంపికలతో ఆటగాళ్లు తమ శక్తిమేరకు పోరాడారు’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
వచ్చే ఏడాది జట్టును మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ‘మేము మంచి జట్టును నిర్మిస్తున్నాం. చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి. సంజు శాంసన్ జట్టులో చేరడం మంచి సంకేతం. అతడు బాగా ఆడుతున్నాడు. కార్తిక్ శర్మ కూడా మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కొందరు కీలక ఆటగాళ్లు మాకు అందుబాటులో లేరు. అలాంటి పరిస్థితుల్లో సరైన ప్రత్యామ్నాయాలను వెతకాల్సి ఉంటుంది. అయినా కూడా మా ఆటగాళ్లు బాగా పోరాడారు. సీఎస్కే అభిమానుల మద్దతు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు మాకు మద్దతుగా నిలుస్తుంటారు. గెలిచినా, ఓడినా ఎప్పుడూ మా వెంట ఉంటారు. ఈ సీజన్లో కొన్ని హోమ్ మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి మేము మెరుగ్గా ఆడాం. వచ్చే ఏడాది మరింత బలమైన జట్టుతో తిరిగి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు. హైదరాబాద్ చేతిలో ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా దూరం చేసుకుంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..