RR vs RCB Eliminator 2024: ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్‌ఆర్ మ్యాజిక్ చేస్తేనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Prediction on RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన ఆర్‌సీబీ.. అదే ఊపులో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడిన ఆర్ఆర్.. గెలిచేందుకు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2024లో బెంగళూరు అద్భుతం చేసింది. లీగ్ ఆరంభంలో ఆర్‌సీబీ ప్రదర్శనను చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే ఆర్‌సీబీకి ఫ్యాన్స్ నుంచి క్రేజ్ మామూలుగా దక్కలేదు. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు బాధ్యతతో ఆడుతూ.. కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఫాఫ్, కోహ్లీ జోడీ ఓపెనింగ్‌లో అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నారు. బౌలింగ్ కూడా బాగుంది. ఆర్‌సీబీ ప్రస్తుతం దూకుడు మీదుంది’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Donald Trump Biopic: మొదటి భార్య ఇవానాను రేప్ చేసిన డొనాల్డ్ ట్రంప్!
‘రాజస్థాన్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడింది. చివరి మ్యాచ్ ఒకటి రద్దైంది. గత వారంలో వారు ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఆర్ఆర్ ఆటగాళ్లకు సరైన సాధన లేదనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫయర్‌లో చేసిన మ్యాజిక్‌నే ఆర్‌ఆర్ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మరోసారి ఏకపక్ష మ్యాచ్‌ను చూడాల్సి వస్తుంది. దూకుడు మీదున్న ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకపోతే ఆశ్చర్యకరమే’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఆర్‌సీబీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సన్నీ చెప్పకనే చెప్పాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు