Yashasvi Jaiswal Becomes Youngest Cricketer To Hit 2 Centuries in IPL: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. సోమవారం (ఏప్రిల్ 22) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ నిప్పులు చెరిగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేశాడు. జైస్వాల్ మెరుపు శతకం చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఒక్క వికెట్టే కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది. జొస్ బట్లర్ (35; 25 బంతుల్లో 6×4), సంజూ శాంసన్ (38 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 2×6) రాణించారు.
సెంచరీతో చేసిన యశస్వి జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల వయస్సు లోపు 2 సెంచరీలు చేసిన ఆటగాడు ఇప్పటివరకు ఎవరూ లేరు. ప్రస్తుతం యశస్వి వయస్సు 22 ఏళ్ల 116 రోజులు. గతేడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పైనే 21 ఏళ్ల 123 రోజుల వయస్సులో అతడు సెంచరీ బాదాడు.
Also Read: Sudigadu 2: ‘సుడిగాడు 2’ కథ నేనే రాస్తున్నా: అల్లరి నరేష్
యశస్వి జైస్వాల్ గత ఏడాది భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌పై భారత్ తరపున టెస్ట్, టీ20 అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు టీమిండియాకు 9 టెస్టులు, 17 టీ20లు ఆడాడు. టెస్టులో 3, టీ20ల్లో ఓ సెంచరీ బాదాడు. ఇక 45 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1397 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.