Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
- గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఆడని రోహిత్ శర్మ
- తాజాగా మైదానంలోకి దిగిన హిట్‌మ్యాన్
- అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా స్టార్ క్రికెటర్లు బయట కనిపిస్తే.. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. బిజీ షెడ్యూల్, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చాలామంది ఆటగాళ్లకు ఎక్కువసేపు ఆగే అవకాశం ఉండదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అయినా ఆమె కోసం వెయిట్ చేసి సెల్ఫీ ఇచ్చాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లలో ఆడని హిట్‌మ్యాన్.. తాజాగా మైదానంలోకి దిగాడు. హోటల్ నుంచి టీమ్ బస్సులోకి వెళ్లే సమయంలో ఓ లేడీ సెల్ఫీ అడిగింది. సెక్యూరిటీ ఆపినా.. రోహిత్ చెప్పడంతో ఆమె ఎంతో సంతోషంగా హిట్‌మ్యాన్ దగ్గరికి వచ్చింది. అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో ఆ లేడీ ఫ్యాన్ ఒక్కసారిగా కంగారు పడింది. ఆమె మరో ఫోన్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఇంతలో ఓ చిన్నారితో ఫోటో దిగాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇక రోహిత్ శర్మ టీమ్ బస్సు వెళుతుండగా.. ఆ లేడీ అభిమాని పిలిచింది. డోర్ దగ్గర ఆగిన హిట్‌మ్యాన్.. ఆమెకు సెల్ఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాంతో ఆ అభిమాని సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఎంతో ఓపికగా ఉన్న హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘రోహిత్ గొప్ప ఆటగాడే కాదు.. అంతకంటే గొప్ప మనిషి’, ‘డౌన్ టు ఎర్త్ పర్సన్’, ‘ఫ్యాన్స్‌ను రోహిత్ ఎంత గౌరవిస్తాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా కనిపించినా.. బయట అభిమానులతో రోహిత్ చాలా సింపుల్‌గా, ఆప్యాయంగా ఉంటాడని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
The excitement of a fan while meeting Rohit Sharma. 😍❤️ pic.twitter.com/SCUbLe68r2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 9, 2026
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!