ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన బెంగళూరు.. మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టులో అల్జరీ జోసెఫ్ స్థానంలో టాప్లీ ఆడుతున్నారు.
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), గ్రీన్, మ్యాక్స్ వెల్, రజత్ పాటిదర్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), టాప్లీ, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింట్ ఎలెవన్:
క్వింటాన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), పడిక్కల్, స్టోయినీస్, నికోలస్ పూరన్, బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్, మయాంక్ యాదవ్.