RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నేడు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య కీలక మ్యాచ్
- కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు నమోదు చేసి ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగే కీలక మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కింగ్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఆర్సీబీ, కేకేఆర్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన షేన్ వాట్సన్.. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విరాట్ కోహ్లీ ఆడిన షాట్ గురించి ప్రస్తావించాడు. ‘గత మ్యాచ్‌లో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా షాట్ ఆడాలని మేము ఆశిస్తున్నాం’ అని వాట్సన్ సరదాగా వ్యాఖ్యానించాడు. ముంబైపై కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ లాంటి సీనియర్ బ్యాటర్ తప్పిదాల నుంచి త్వరగా నేర్చుకుంటాడని వాట్సన్ పేర్కొన్నాడు. ‘ప్రతి టీమ్ కోహ్లీ కోసం ప్రత్యేక ప్రణాళికలతోనే బరిలోకి దిగుతుంది. అతడి బలహీనత ఎక్కడ ఉందో గుర్తించి దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ కింగ్ కోహ్లీకి వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు’ అని వాట్సన్ తెలిపాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
విరాట్ కోహ్లీని మొదటి బంతి నుంచే ఒత్తిడిలో పడేయాలని కేకేఆర్ భావిస్తున్నట్లు షేన్ వాట్సన్ వెల్లడించాడు. ‘విరాట్‌ను బుట్టలో వేయాలంటే మొదటి బంతి నుంచే కచ్చితమైన ప్రణాళికతో ఉండాలి. లేకపోతే అతడు జట్టుకు అద్భుతమైన ఆరంభం అందిస్తాడు. కోహ్లీ ఎన్నో ఏళ్లుగా అదే చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో కోహ్లీ అరుదుగా చేసే తప్పిదం మాకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఇక ఐపీఎల్ 2026లో కేకేఆర్ అద్భుత కంబ్యాక్ ఇచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన కోల్‌కతా.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. బుధవారం ఆర్సీబీపై విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును మరింత పటిష్టం చేసుకోనుంది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్-1 స్థానాన్ని దక్కించుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!