RCB vs GT: నేను హిట్టింగ్ చేయడానికి చేయడానికి కారణం అతడే: విల్ జాక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Jacks Said I will never forget batting with Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడంను తాను ఎప్పటికీ మరిచిపోలేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హీరో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అన్నాడు. తాను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్‌లో దిగ్గజ క్రికెటర్ కోహ్లీ ఉండటమే కారణం అం ఇతెలిపాడు. విరాట్ దూకుడుగా తన మీద ఒత్తిడి లేకుండా చేసిందని జాక్స్ చెప్పాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై అతడు విధ్వంసక శతకం చేశాడు. 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన జాక్స్ .. 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకొనేందుకు కేవలం 10 బంతులనే తీసుకున్నాడు.
సెంచరీ చేసిన విల్ జాక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఈ సందర్భంగా తన ఆటతీరుపై జాక్స్ స్పందించాడు. ‘భారీ విజయం సాధించడం అద్భుత అనుభూతి పొందుతున్నా. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మంచి శుభారంభం ఇచ్చారు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే కాస్త ఇబ్బందిపడ్డా. విరాట్ దూకుడుగా ఆడి.. నామీద ఒత్తిడి లేకుండా చేశాడు. నాకు కుదురుకుని అవకాశాన్ని ఇచ్చాడు. సరిగ్గా రెండు ఓవర్లు బాగా ఆడితే.. మ్యాచ్‌ను ముగించేయొచ్చని టైమౌట్‌లో మాట్లాడుకున్నాం. మేం అనుకున్న విధంగానే జరిగింది. రెండు ఓవర్లలో భారీగా పరుగులు చేశాను. అద్భుతమైన అనుభూతిని పొందాను’ అని జాక్స్ తెలిపాడు.
Also Read
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Also Read: CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
‘స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పాజిటివ్ కోణంలో ఎటాకింగ్ చేశా. మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా పరుగులు చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యా. నన్ను నేను నమ్మాను. మిగతా మ్యాచుల్లోనూ గెలుస్తాం. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. అతను ఒక లెజెండ్. ప్రతి ఒక్కరూ కోహ్లీతో ఆడాలని కోరుకుంటారు. గొప్ప అనుభూతి ఇది. కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా. ఇవాళ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి 17 బంతుల్లో 17 పరుగులు చేసిన నేను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్‌లో దిగ్గజ క్రికెటర్ ఉండటమే కారణం’ అని విల్ జాక్స్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
-
Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!