NTV Telugu Site icon

RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్‌ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్‌!

Virat Kohli Throw

Virat Kohli Throw

Virat Kohli Dismiss Shahrukh Khan With Unbelievable Throw: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ షారూఖ్‌ ఖాన్‌ను కళ్లు చెదిరే త్రోతో రనౌట్‌ చేశాడు. విరాట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌ టైటాన్స్ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ను విజయ్ కుమార్ వైశాక్ వేశాడు. విజయ్ వేసిన నాలుగో బంతిని రాహుల్ తెవాతియా ఆఫ్‌ సైడ్‌కు షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న షారుక్ ఖాన్ సింగిల్ కోసం పరుగెత్తుకొచ్చాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న తెవాతియా.. నో అంటూ వెనుక్కి వెళ్లమని చెప్పాడు. షారూఖ్‌ వెనక్కి వెళ్లే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్‌ కోహ్లీ.. బౌలర్‌ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇంకేముంది షారూఖ్‌ పెవిలియన్ చేరక తప్పలేదు.

Aslo Read: Faf du Plessis: ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు.. తొలి బ్యాటర్‌గా!

విరాట్‌ కోహ్లీ అద్భుత త్రోతో బెంగళూరు ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. థర్డ్‌ అంపైర్‌కు ఫీల్డ్‌ అంపైర్‌ రిఫర్‌ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. విరాట్ సంచలన త్రో చూసిన అందరూ బిత్త‌ర‌పోయారు. బెంగళూరు ఆటగాడు కామెరాన్ గ్రీన్ అయితే విరాట్ వైపు చూస్తూ.. ఏం కొట్టావ్ అన్నా అన్నట్లు ఓ రియాక్ష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.