Dinesh Karthik: నాకు బ్యాటింగ్ వస్తుందనుకోలేదు: దినేశ్ కార్తిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik Said I wasn’t mentally ready for Batting vs GT: చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండడంతో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాదనుకున్నా అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీపర్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. వికెట్లను కోల్పోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లిపోయా అని డీకే తెలిపాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగాం అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో డీకే 12 బంతుల్లో 21 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు.
మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ… ‘బెంగళూరు ఇన్నింగ్స్‌లో తొలి నాలుగు ఓవర్ల తర్వాత నేను ఓ కప్పు టీ తాగా. నేను మైదానంలోకి దిగాల్సిన అవసరం దాడులే అనుకున్నా. కాసేపటికి కాఫీ తెప్పించుకుని తాగాను. నేను ప్యాడ్లను కూడా కట్టుకోలేదు. బ్యాటింగ్ చేసేందుకు మానసికంగానూ సిద్ధంగా లేను. చాలా రిలాక్స్డ్గా ఉన్నా. మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా వికెట్లను కోల్పోయాం. వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లా. ఆరంభంలో ఆచితూచి ఆడాను. కుదురుకున్నాక పరుగులు చేశా. మా బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేశాం. ఈ మ్యాచ్ విజయంలో క్రెడిట్ బౌలర్లదే’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Mohammed Siraj: గుజరాత్‌తో మ్యాచ్ ఆడతానని అనుకోలేదు: సిరాజ్
2008 ఎడిషన్ నుంచి దినేశ్ కార్తిక్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 253 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4799 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 144 క్యాచ్‌లు, 36 స్టంప్ ఔట్లు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు డీకే ఆడాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!