RCB IPL 2026 Playoffs: ఆర్‌సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
- వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్న ఆర్‌సీబీ
- ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్
- నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే క్వాలిఫయర్-1 అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Top 2 Chances in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనకపడింది. కెప్టెన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి.. టాప్-2లో నిలిచింది. అయితే ఇటీవల వరుస పరాజయాలతో బెంగళూరు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో మూడో స్థానంలో ఉంది. టాప్ 2లో ఉండాలంటే.. ఆర్‌సీబీ సమీకరణాలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం.
నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే:
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ఇంకా నాలుగు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడాల్సి ఉంది. ముఖ్యంగా టాప్‌లో ఉన్న పంజాబ్, హైదరాబాద్‌లపై ఫలితాలు ఆర్‌సీబీ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఆర్‌సీబీ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో లీగ్ దశ ముగిస్తుంది. 10 జట్ల ఫార్మాట్‌లో 20 పాయింట్లు సాధించిన జట్టు దాదాపు టాప్-2లో నిలుస్తుంది. దీంతో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం ఆర్‌సీబీకి లభిస్తుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మూడు మ్యాచ్‌లు గెలిస్తే:
నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిస్తే ఆర్‌సీబీ 18 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది. ప్రస్తుతం జట్టు నెట్ రన్‌రేట్ +1.234గా ఉండటం పెద్ద ప్లస్‌గా మారింది. అదే పాయింట్లతో ఇతర జట్లు లీగ్ దశను ముగించినా.. ఆర్‌సీబీకి మెరుగైన నెట్ రన్‌రేట్ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లేదా పంజాబ్‌పై బెంగళూరు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
రెండు మ్యాచ్‌లు గెలిస్తే:
ఆర్‌సీబీ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిస్తే.. 16 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో టాప్-2 అవకాశాలు పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడతాయి. హైదరాబాద్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు ఓడిపోవాలి. అలాగే పంజాబ్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవాల్సి ఉంటుంది. అదనంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు.
ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ తదుపరి ఆడే రెండు మ్యాచ్‌లు ‘డూ ఆర్ డై’గా మారాయి. మరో ఓటమి ఎదురైతే.. టాప్-2 ఆశలు దాదాపు కష్టమవుతాయి. పాయింట్ల పట్టికలో మూడో లేదా నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అభిమానులు ఆశించినట్లుగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో బలంగా నిలవాలంటే.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనల్‌లా ఆడాల్సిందే. క్వాలిఫయర్-1 ఆడే అవకాశం కోసం ఆర్‌సీబీ గట్టిగా ప్రయత్నిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు