RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Read Also: Pashamylaram Blast: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి..
‘‘ ప్రాథమికంగా మూడు నుంచి 5 లక్షల మంది ప్రజలు సమావేశమయ్యేలా చేసినందుకు ఆర్సీబీ బాధ్యత వహించనట్లు కనిపిస్తోంది. ఆర్సీబీ పోలీసుల నుంచి తగిన అనుమతి, సమ్మతి తీసుకోలేదు. అకస్మాత్తుగా, వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. దీంతోనే ప్రజలు గుమగూడారు’’ అని ట్రిబ్యునల్ చెప్పింది. ఆర్సీబీ చివరి నిమిషంలో విజయోత్సవ కార్యక్రమం గురించి ప్రకటించడాన్ని ట్రిబ్యునల్ విమర్శించింది. ‘‘ఆర్సీబీ ముందస్తు అనుమతి లేకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దాదాపు 12 గంటల తక్కువ సమయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారని ఆశించలేము’’ అని చెప్పింది.
ట్రిబ్యునల్ ఈ విషయంలో పోలీసులను సమర్థించింది. ‘‘పోలీస్ సిబ్బంది కూడా మనుషులే. వారు దేవుళ్లు కాదు, మాంత్రికులు కాదు, అల్లాద్దీన్ అద్భతదీపం వంటి శక్తులు లేవు. తగిన సమయం లేకపోవడంతో ఏర్పాట్లు చేయలేకపోయారు. పోలీసులకు తగిన సమయం సమయం ఇవ్వలేదు’’ అని చెప్పింది. తొక్కిసలాట ఘటనపై తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ బెంగళూర్ పోలీస్ అధికారి వేసిన పిటిషన్ విచారిస్తూ ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
