NTV Telugu Site icon

IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు

Ramandeep

Ramandeep

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. షారుక్.. చప్పట్లు కొట్టే వీడియోను కెమెరాలో బంధించారు.

Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్‌లైన్ నంబర్లు అంటూ..!

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ స్టార్క్ వేసిన బంతికి రమణదీప్ సింగ్ దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద ఉన్న ఫీల్డర్ రమణదీప్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. దీపక్‌ హుడా 10 బంతుల్లో 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. రమణదీప్ సింగ్ తన క్యాచ్ తో అందరినీ మెస్మరైజ్ చేయగా.. అదిరిపోయే క్యాచ్ అంటూ క్రికెట్ అభిమానులు ఫీల్డర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. రమణదీప్ సింగ్ పట్టిన అద్భుత క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nallari Kiran Kumar Reddy: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారు..

ఇకపోతే.. ఐపీఎల్ లో ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ తమ టాలెంట్ చూపిస్తూ హైలెట్ గా నిలుస్తున్నారు. అందుకే.. ఐపీఎల్ అంటే ప్రతి క్రికెట్ అభిమానికి చాలా ఇష్టం. ఇలాంటి వండర్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయని ఐపీఎల్ కోసం ఎంతోగానూ ఎదురచూస్తు ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ను భారత అభిమానులతో పాటు.. ఇతర దేశాల క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

Show comments