NTV Telugu Site icon

RR vs GT: కదం తొక్కిన జీటీ బౌలర్లు.. తక్కువ స్కోరుకే చాపచుట్టేసిన ఆర్ఆర్

Rr 20 Overs

Rr 20 Overs

Rajasthan Royals All Out For 118 Against Gujarat Titans: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కదం తొక్కారు. అద్భుతమైన బౌలింగ్ వేసి.. 118 పరుగులకే వారిని కట్టడి చేశారు. అవును.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల ఆటగాళ్లున్న ఆర్ఆర్ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఒక్క సంజూ శాంసన్ ఒక్కడే 30 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. జీటీ బౌలర్ల ధాటికి.. ఏ ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. అందరూ ఇలా వచ్చి, అలా వెళ్లిపోవడమే! బట్లర్, షిమ్రాన్, జురేల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఈసారి పూర్తిగా చేతులెత్తేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రియాన్ పరాగ్.. ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.

D Mart : క్యారీ బ్యాగ్‌కు ఛార్జీ విధించిన డి-మార్ట్‌.. రూ.1,500 జరిమానా

ఆది నుంచే జీటీ బౌలర్లు ప్రతాపం చూపించారు. 11 పరుగుల వద్ద బట్లర్‌ని ఔట్ చేసి.. ఆర్ఆర్‌పై ఒత్తిడి పెంచారు. బట్లర్ పోయాక యశస్వీ, సంజూ కలిసి కాస్త పరుగుల వర్షం కురిపించారు. కానీ.. అవసరం లేని పరుగు తీసి, యశస్వీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ దూకుడు మీద ఆడుతూ.. అదే దూకుడులో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇలా వీళ్లిద్దరు ఔటయ్యాక.. ఆర్ఆర్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా.. స్పిన్నర్లైతే ఆర్ఆర్ పతనాన్ని శాసించారు. రషీద్ ఖాన్ ఏకంగా మూడు వికెట్లతో చెలరేగితే.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, పాండ్యా, లిటిల్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. గుజరాత్ టైటాన్స్‌కు 119 పరుగులు చేయాలి. మరి.. అంత తక్కువ స్కోరుని ఆర్ఆర్ డిఫెండ్ చేయగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Sharad Pawar: తన రాజీనామాను ఉపసంహరించుకున్న శరద్ పవార్

Show comments