SRH Fans: హైదరాబాద్ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. టికెట్ల డబ్బు వాపసు!

Srh Fans

Srh Fans

Paytm Insider on SRH vs GT Tickets: హైదరాబాద్ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్‌ 2024 అధికారిక టికెటింగ్‌ పార్ట్‌నర్‌ పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ టికెట్ల డబ్బు వాపసు ఇచ్చేందుకు సిద్ధమైంది. గురువారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో హైదరాబాద్‌, గుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. దాంతో హైదరాబాద్‌ ఫాన్స్ నిరాశకు గురయ్యారు.

Also Read: MI vs LSG: రోహిత్‌ బాదినా.. ముంబైకి తప్పని ఓటమి! చివరి స్థానమే ఇక

అయితే మ్యాచ్‌ రద్దైంది కాబట్టి టికెట్ల డబ్బు రీఫండ్‌ అవుతాయా? లేదా? అన్న ఆందోళన క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ శుభవార్త చెప్పింది. టికెట్‌ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. త్వరలోనే రిజిస్టర్‌ చేసుకున్న ఈ మెయిల్‌కు పూర్తి సమాచారం అందించనున్నట్టుగా పేర్కొంది. మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం పంజాబ్ జట్టుతో హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.