ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్‌పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్‌పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్‌రైజర్స్‌ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి… కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని బాదుడుకు ముంబై స్కోరు 7.2 ఓవర్లలోనే వంద దాటింది.
ఫిఫ్టీ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ఇషాన్… 32 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇషాన్‌కు తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 82 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇషాన్, సూర్యకుమార్ రేంజ్లో ముంబై మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. రోహిత్ 18, పొలార్డ్ 13, పాండ్యా 10 పరుగులే తీశారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది… ముంబై. 236 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు… ఓపెనర్లు శుభారంభం అందించారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
తొలివికెట్‌కు 5.2 ఓవర్లలో 64 రన్స్ జోడించారు. జేసన్ రాయ్ 34 రన్స్ చేయగా, అభిషేక్ శర్మ 33 రన్స్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మనీష్ పాండే ధాటిగా ఆడటంతో… హైదరాబాద్ స్కోర్ బోర్డు ఉరకలు వేసింది. మనీష్ 41 బంతుల్లోనే 69 రన్స్ చేశాడు. మనీష్ ఔటయ్యాక ప్రియం గార్గ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోవడంతో… 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది… హైదరాబాద్. ముంబై 42 పరుగుల తేడాతో గెలిచినా… భారీ వ్యత్యాసంతో నెగ్గకపోవడంతో… ప్లే ఆఫ్ దశకు చేరకుండానే IPL నుంచి నిష్క్రమించింది. 32 బంతుల్లోనే 84 రన్స్ చేసిన ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..