ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓడిన జట్టు ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే తొలి వికెట్ పడింది.
Also Read : Bapatla Crime: గ్యాంగ్ రేప్ ఘటనలో ఊహించని ట్విస్ట్..!
ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగులకే కీలకమైన రెండు వికెట్లను ముంబై ఇండియన్స్ జట్టు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్.. సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి భారీ షాట్స్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసే సరికే ముంబై స్కోర్ 62 పరుగులు చేసింది.
Also Read : Minister Sabitha: తెలంగాణ విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి..
ముంబై ఇండియన్స్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ తో 33 పరుగులు), కామెరూన్ ( 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు)లు చేశారు. ఇక పదకొండవ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన నవీన్ హుల్ హక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ లను అవుట్ చేసి ముంబై ఇండియన్స్ జట్టును కోలుకోని దెబ్బ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఉన్నారు.