Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
- ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం
- మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
- కేకేఆర్ ఎప్పుడూ నాకు ఎంతో చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండే (45; 33 బంతుల్లో 6×4)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మనీష్.. కేకేఆర్‌తో తన అనుబంధం, జట్టులో అవకాశాలు రాకపోయినా మోటివేషన్ కోల్పోకుండా ఎలా ముందుకు సాగాడో భావోద్వేగంగా వివరించాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన మనీష్.. 2024 తర్వాత మళ్లీ జట్టులో కీలక పాత్ర పోషించడం ప్రత్యేకంగా నిలిచింది.
2014, 2024లో కోల్‌కతాకు చాలా చేశారు అనే ప్రశ్నకు మనీష్ పాండే మాట్లాడుతూ… ‘బహుశా అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నానేమో. కేకేఆర్ ఎప్పుడూ నాకు ఎంతో చేసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి చూస్తే.. నేను బ్యాటింగ్ చేసిన మ్యాచ్ ఇదే. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో కూడా ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నా కానీ.. అవకాశం రాలేదు. కానీ ఈ మ్యాచ్ మాత్రం నాకు ఎంతో ప్రత్యేకం. క్రీజులో ఎక్కువసేపు ఉండి జట్టును గెలిపించాలనుకున్నా. అదృష్టవశాత్తూ అదే జరిగింది. మధ్యలో రోవ్‌మన్ పావెల్‌తో కలిసి నిర్మించిన భాగస్వామ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. కొన్ని మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అదే మా విజయానికి కారణమైంది. మిగిలిన మ్యాచ్‌లో కూడా ఇదే విధంగా ఆడి జట్టును టాప్-4లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తన ఇన్నింగ్స్‌లో గుర్తుండిపోయిన షాట్ల గురించి అడగగా.. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వేసిన లెంగ్త్ బాల్స్‌పై కొట్టిన కొన్ని ఫోర్లు ప్రత్యేకంగా అనిపించాయని మనీష్ పాండే చెప్పాడు. ‘ఆ సమయంలో నేను బాగా బ్యాటింగ్ చేస్తున్నానని అనిపించింది. అందుకే క్రీజులో ఎక్కువసేపు ఉండాలని భావించా. నేను ఆడకపోయినా జట్టులో భాగంగా ఉండాలని ఎప్పుడూ భావిస్తాను. ఎజట్టుకు అవసరమైతే ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఈ సీజన్ మొత్తం అదే చేశాను. మా జట్టులో యువ ఆటగాళ్లు, సీనియర్లు అందరూ మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నారు. అదే మమ్మల్ని మళ్లీ బలంగా తిరిగి వచ్చేలా చేస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.
ఫీల్డింగ్‌పై తాను కష్టపడే విధానం గురించి కూడా మనీష్ పాండే వివరించాడు. ‘మేము రోజూ గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే.. దాదాపు 45 నిమిషాలు ఫీల్డింగ్‌కే కేటాయిస్తాం. వర్షం వచ్చినా, ఎండ ఉన్నా అస్సలు ఆగం. నేను బౌలింగ్ చేయను కాబట్టి ఫీల్డింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తాను. ఒక్క రన్ సేవ్ చేయడం నుంచి అద్భుత క్యాచ్‌లు పట్టడం వరకు జట్టుకు ఉపయోగపడాలని కోరుకుంటాను. ఫీల్డింగ్‌లో బంతి నా వైపే రావాలని ఎప్పుడూ అనిపిస్తుంది. జట్టుకు ఏ విధంగానైనా నా వంతు సాయం చేయడం గర్వంగా ఉంటుంది. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’ అని మనీష్ పాండే చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!