IPL 2026: కొత్త లోగోతో కొత్త ప్రారంభం.. Lucknow Super Giants కొత్త లోగో ఆవిష్కరణ!

  • LSC కొత్త లోగో..
  • కొత్త లోగోలో రెడ్ కలర్ థీమ్‌..
  • గరుడ, కిరీటం, ఏనుగు ప్రతీకలు.
Lsg

Lsg

IPL 2026 Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants (LSG)) తమ కొత్త లోగోను అధికారికంగా విడుదల చేసింది. గతంలో నీలి రంగు థీమ్‌లో ఉన్న లోగోను మార్చి.. ఈసారి రెడ్ కలర్ ఆధారంగా రూపొందించిన కొత్త ఎంబ్లమ్‌ ను చేర్చింది. ఈ లోగోలో గరుడ, కిరీటం, ఏనుగు అనే మూడు ప్రధాన ప్రతీకలను చేర్చడం ద్వారా లక్నో నగరం, ఉత్తరప్రదేశ్ సంస్కృతి, గౌరవాన్ని ప్రతిబింబించేలా లోగోను డిజైన్ చేశారు.

ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!

ఈ కొత్త లోగోలో గరుడ ప్రతీక జట్టుకు ఉన్న ధైర్యం, సవాళ్లను అధిగమించి ఎత్తులకు ఎదగాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది. జట్టు ఆడే దూకుడు, విజయం సాధించాలనే ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తుందని ఫ్రాంచైజీ తెలిపింది. ఇంకా లోగోలోని కిరీటం జట్టు గౌరవం, బాధ్యతను సూచిస్తుంది. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి లక్షలాది అభిమానుల ఆశలు, విశ్వాసాన్ని మోస్తున్నామనే భావనను ఇది తెలియజేస్తుంది. ఇక లోగో మధ్యలో ఉన్న ఏనుగు శక్తి, సహనం, జ్ఞానం, ఐక్యతను సూచిస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా జట్టుకు అండగా నిలిచే అభిమానుల విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

జట్టు యజమాని, RPSG గ్రూప్ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా మాట్లాడుతూ.. ఈ లోగో తమకు భావోద్వేగపూరితమైన గుర్తింపు అని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మొదటి రోజు నుంచే జట్టును ఆదరించారని, ఆ ప్రేమకు గుర్తుగా ఈ కొత్త లోగోను రూపొందించామని చెప్పారు. ఇది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాకుండా.. లక్నో నగర గౌరవాన్ని నిలబెట్టే వాగ్దానం అని ఆయన పేర్కొన్నారు.

55dB ANC, 54 గంటల బ్యాటరీ, సూపర్ ఫీచర్లతో Oppo Enco Air 5 Pro లాంచ్..!

2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (స్క్వాడ్):
రిషభ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, ఎయిడెన్ మార్క్రం, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రెట్జ్కీ, నికోలస్ పూరన్, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, దిగ్వేష్ రాథి, ఎం. సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్, మొహమ్మద్ షమీ, నమన్ తివారి, వనిందు హసరంగా, జోష్ ఇంగ్లిస్, అక్షత్ రఘువంశీ, అన్రిచ్ నోర్జే, ముకుల్ చౌదరి.