LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
- ఐపీఎల్లో ప్రతి జట్టుకు సొంత మైదానం
- హోమ్ గ్రౌండ్ అంటే ఏ జట్టుకైనా అదనపు బలం
- లక్నోకు మాత్రం బలహీనతగా సొంత మైదానం
- అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG Unwanted IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకు సొంత మైదానం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి టీమ్ లీగ్ దశలో 7 మ్యాచ్‌లను హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. సాధారణంగా హోమ్ గ్రౌండ్ అంటే ఏ జట్టుకైనా అదనపు బలం. అందుకే హోమ్ అవేలో పరాజయాలు చవిచూసినా.. హోమ్ గ్రౌండ్లో రెచ్చిపోతుంటాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కు మాత్రం సొంత మైదానం బలహీనతగా మారింది. వరుస పరాజయాలు చవిచూస్తున్న లక్నో.. ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
హోమ్ గ్రౌండ్లో అత్యధికసార్లు వరుస పరాజయాలు చవిచూసిన జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ రికార్డులో నిలిచింది. 2025-26 సీజన్లో లక్నో 7 వరుస పరాజయాలను ఎదుర్కొంది. మిగతా జట్లు కూడా సొంత మైదానాల్లో వరుస ఓటములు ఎదురుకొన్నా.. చాలా ఏళ్లుగా టోర్నీలో కొనసాగుతున్నాయి. 202లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో.. అప్పుడే ఈ చెత్త రికార్డు ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 2013 నుంచి 2015 మధ్య ఢిల్లీ వరుసగా 9 మ్యాచ్‌లు ఓడింది. ఇది ఇప్పటికీ అత్యధిక వరుస హోమ్ పరాజయాల రికార్డుగా ఉంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రెండో స్థానంలో మాజీ టీమ్ డెక్కన్ ఛార్జర్స్ ఉంది. హైదరాబాద్‌లో 2008-2011 మధ్య 8 మ్యాచ్‌లు వరుసగా ఓడింది. ఇదే డీసీ 2011-12 మధ్య మరోసారి 7 వరుస పరాజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ మాజీ జట్టు పూణే వారియర్స్ ఇండియా 2012-13 మధ్య పుణేలో 7 మ్యాచ్‌లు వరుసగా ఓడింది. తాజాగా లక్నో కూడా ఈ జాబితాలో చేరింది. 2025-26 మధ్య లక్నోలో వరుసగా 7 మ్యాచ్‌లు ఓడుతూ చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ వరుస పరాజయాలు జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ స్టాట్స్ చూస్తే.. హోమ్ గ్రౌండ్ అనేది ఎప్పుడూ అడ్వాంటేజ్‌గా ఉండకపోవచ్చు. సరైన ఫామ్ లేకపోతే, పరిస్థితులు కలిసిరాకపోతే..మైదానం ఏదైనా ఓడాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!