Thug Life: ఆఖరికి సిద్దార్థ్ కూడానా.. అసలు ఏం జరుగుతోంది భయ్యా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth out From Thug Life:”కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘తగ్ లైఫ్’ నుంచి ఇప్పటికే దుల్కర్ సల్మాన్, జయం రవిలు తప్పుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు దుల్కర్ డేట్స్ కుదరక తాను సినిమా చేయలేనని చెప్పగా తరువాత జయం కూడా తప్పుకుంటున్నట్టు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ వార్తలు రావడంతో ఈ సినిమాలో కమల్ ఒక్కరే ఉంటారా అని కూడా నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తన డేట్స్ తీసుకుని వాటిని వృధా చేశారని చెప్పి ‘తగ్ లైఫ్’ నుండి వాకౌట్ చేయగా, అదే కారణంతో జయం రవి కూడా వాకౌట్ చేశాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌కు బదులుగా శింబు, జయం రవికి బదులుగా అరవింద్‌సామిని ఎంపిక చేసినట్లు సమాచారం.
Ram Charan : భార్య, కూతురుతో చెన్నై కి రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిందిగా..
Also Read
ఇక ఇప్పుడు తప్పుకున్న ఇద్దరు చెప్పిన కారణంతోనే నటుడు సిద్ధార్థ్ తగ్ లైఫ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం సిద్ధార్థ్‌ను తన గురువుగా భావించి అదే విషయాన్నీ చెబుతూ ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ తన గురువు సినిమా నుండి వైదొలగడం పెద్ద షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు కమిట్ అయినందున ఇకపై తన కాల్షీట్ వేస్ట్ చేయలేనని సిద్ధార్థ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ‘తగ్ లైఫ్’ నుంచి సిద్ధార్థ్ వైదొలిగినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ‘తగ్ లైఫ్’ నుంచి ఒక్కొరొక్కరుగా నటులు దూరమవుతుంటే కమల్ అన్ని పాత్రల్లోనూ ‘దశావతారం’లా నటించాల్సి వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!