Site icon NTV Telugu

KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?

Kkr

Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్టులో ఒక ఆసక్తికర ట్రెండ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్స్ తరువాతి సీజన్‌లో జట్టులో స్థానం కోల్పోతున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ ఉండడం విశేషం. దాంతో కోల్‌కతా ఆటగాళ్లకు ‘వైస్ కెప్టెన్సీ శాపం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నితీష్ రాణా 2024లో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2025 సీజన్‌కు వచ్చేసరికి అతను జట్టులో చోటు కోల్పోయాడు. అదే విధంగా వెంకటేష్ అయ్యర్ 2025లో వైస్ కెప్టెన్‌గా ఉండగా.. 2026లో అతనికి కూడా జట్టులో స్థానం దక్కడం లేదు. ఇప్పుడు 2026 సీజన్‌లో రింకు సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 2027లో రింకుకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా? అని కేకేఆర్ ఫాన్స్ అంటున్నారు. క్రికెట్‌లో ఫామ్, టీమ్ కాంబినేషన్, వేలం వంటి అనేక కారణాల వల్ల ఆటగాళ్లకు అవకాశాలు మారుతుంటాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్‌ 2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. 220 భారీ స్కోర్ చేసినా.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 65 పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ 226 రన్స్ చేయగా.. కోల్‌కతా 161కే ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం కోల్‌కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

 

Exit mobile version