Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
- ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమి
- వెక్కివెక్కి ఏడ్చిన ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్
- ఎమోషనల్‌కు గురవుతున్న ఎస్ఆర్హెచ్ ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Maran Crying After SRH Eliminate From IPL 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్.. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ దాడికి ఎస్ఆర్హెచ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా.. రాజస్థాన్ భారీ స్కోర్ సాధించి చివరికి 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జట్టు ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడుస్తూ కూడా బాగా ఆడారంటూ సన్‌రైజర్స్ ఆటగాళ్లను ప్రశంసించారు. స్టేడియంలో కావ్య పాప ఎమోషనల్‌గా కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్హెచ్ జట్టుకు కావ్య ఎంతగా మద్దతుగా నిలుస్తున్నారో అభిమానులకు తెలిసిందే. గెలుపులో ఆనందంతో ఉప్పొంగిపోయే ఆమె.. ఓటముల్లో కూడా అదే స్థాయిలో బాధపడుతుంటారు. ఇప్పుడు ఎలిమినేటర్‌లో దారుణ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ నిష్క్రమించడంతో కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కూడా ఎమోషనల్‌కు గురి చేసింది.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్. బుడ్డోడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక దశలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడేమో అనిపించింది. అయితే సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు జోఫ్రా ఆర్చర్ (3/58) కీలక వికెట్స్ పడగొట్టి ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణమయ్యాడు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్ సహా ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో) ధాటిగా ఆడాడు. హింగే మూడు వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో ఎస్ఆర్హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (38; 20 బంతుల్లో) టాప్ స్కోరర్. ఇషాన్ కిషన్ (33), సలీల్ అరోరా (35) రాణించారు. ఇప్పుడు రాజస్థాన్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనుంది. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైభవ్ సూర్యవంశీ ఇదే ఫామ్ కొనసాగిస్తే రాజస్థాన్ ఫైనల్‌కు చేరడం ఖాయం.
You gotta feel for Kavya Maran.😭💔
– SRH lost the final against KKR in 2024
– Finished at no.6 in 2025
– Lost eliminator against RR in 2026She created one of the most destructive batting Line-up.But still SRH batters are disappointing her in crucial matches.💔 pic.twitter.com/nRAAEol2I6
— Drona (@drona_17) May 27, 2026
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!