NTV Telugu Site icon

Jasprit Bumrah: కెనడా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నా: జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah Interview

Jasprit Bumrah Interview

Jasprit Bumrah Wanted To Move Canada: భారత క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లలో ‘జస్ప్రీత్ బుమ్రా’ ఒకడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా.. 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్‌లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మేటి పేసర్ అయిన బుమ్రా.. ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. కెనడా క్రికెట్‌ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాడట. తన సతీమణి, స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ సంజన గణేశన్‌తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బుమ్రా స్వయంగా ఈ విషయంను వెల్లడించాడు.

‘నువ్వు ఒకప్పుడు కెనడాకు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్నావు కదా’ అని జస్ప్రీత్ బుమ్రాను సంజన గణేశన్‌ అడిగారు. అందుకు బుమ్రా బదులిస్తూ… ‘నిజమే, అప్పట్లో ఆ ఆలోచన వచ్చింది. భారతదేశంలో ప్రతి కుర్రాడూ క్రికెట్‌ ఆడాలనుకుంటాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే కుర్రాళ్లు ప్రతి వీధిలోనూ ఓ పాతిక మంది ఉంటారు. అందుకే ప్రత్యామ్నాయ ప్రణాళిక వేసుకున్నా’ అని తెలిపాడు.

Also Read: Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!

‘మా మేనమామ కెనడాలో ఉన్నారు. నేను చదువు పూర్తయ్యాక అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా. అయితే అక్కడ భిన్నమైన సంస్కృతి ఉంటుందన్న కారణంతో మా అమ్మ నన్ను వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత నాకు అంతా కలిసి వచ్చింది. ఐపీఎల్, భారత జట్టులో చోటు దక్కింది. లేదంటే నేను కెనడాకు వెళ్లి.. ఆ దేశ క్రికెట్‌ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. ఇక్కడే ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 125 మ్యాచులు ఆడాడు.

Show comments