NTV Telugu Site icon

Ishan Kishan: సన్‌రైజర్స్ జట్టులో తన కెరీర్‌ను మెరుగుపర్చుకోవచ్చు..

Ishan Kishan

Ishan Kishan

ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు. కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు.. ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసింది. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కిషన్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయినప్పటికీ, అతను దేశీయ క్రికెట్‌లో తన ప్రతిభను ప్రదర్శించాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీలలో సెంచరీలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మొదటి మ్యాచ్ ఆడిన ఇషాన్ కిషన్.. 45 బంతుల్లో సెంచరీ చేశాడు.

Read Also: Realme P3 Ultra 5G: 6.83 అంగుళాల డిస్ ప్లే, 6000mAh బ్యాటరీ ఫోన్ రూ.3000 తగ్గింపుతో సేల్ ప్రారంభం

ఈ క్రమంలో.. ఇషాన్ కిషన్ గురించి సంజయ్ బంగర్ మాట్లాడుతూ, అతను ముంబై జట్టులో ఉన్నప్పుడు పెద్ద ఆటగాళ్ల గుప్పిట్లో ఉన్నాడని.. కానీ హైదరాబాద్‌ జట్టులో తనకు చోటు లభించిందని బంగర్ పేర్కొన్నారు. “ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు అతను పెద్ద స్టార్లతో కలిసి ఆడాడు. కానీ SRHలో అతనికి స్వేచ్ఛ ఉంది,” అని బంగర్ తెలిపారు.
సన్‌రైజర్స్ జట్టులో ఉన్న కిషన్ తన కంటికి కనిపించే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నాడని చెప్పారు. అతనికి SRHలో ఎక్కువ స్థానం లభించడం, తన కెరీర్‌ను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు.

Read Also: Smartphones: వచ్చే నెలలో రాబోయే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చాటాడు. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్లో ఉండటం వల్ల కిషన్ తన సొంత గుర్తింపును సృష్టించుకునే అవకాశం లభిస్తుందని బంగర్ అన్నారు. ఐపీఎల్ చరిత్రలో వికెట్ కీపర్‌గా రెండవ వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో (106*) పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.