NTV Telugu Site icon

T20 World Cup 2024: సంజూ, డీకేలకు నిరాశే.. 15 మందితో కూడిన భారత జట్టు ఇదే!

Team India

Team India

Irfan Pathan’s India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024కు సమయం దగ్గరపడుతోంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్‌ 1 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ డ్రీమ్ టీమ్‌లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు గురించి మాట్లాడగా.. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జట్టును వెల్లడించాడు.

ఇర్ఫాన్ పఠాన్ తన జట్టుకు బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌లో నలుగురిని ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ను ఎంచుకోగా.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. శుభ్‌మన్‌ గిల్‌ను బ్యాకప్‌ ఓపెనర్‌గా తీసుకున్నాడు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్‌, శివమ్‌ దూబెకు అవకాశం ఇచ్చాడు. ఏకైక పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యాకు ఓటేశాడు. పంత్‌తోనే కీపింగ్‌ చేయిస్తా అని తెలిపాడు. ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న సంజూ శాంసన్, దినేష్ కార్తీక్‌లకు ఇర్ఫాన్ చోటివ్వలేదు. బ్యాకప్‌ కీపర్‌గా ఎవరిని ఎంచుకోకపోవడం విశేషం. భారత స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను పరిగణలోకి తీసుకోలేదు.

స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు తన జట్టులో ఇర్ఫాన్ పఠాన్ చోటిచ్చాడు. యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను స్పిన్‌ విభాగంలో తీసుకున్నాడు. ఇక పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహమ్మద్ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను అవకాశం ఇచ్చాడు. మొహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధిస్తే జట్టులో ఉంటాడన్నాడు. రవి బిష్ణోయ్, వరుణ్‌ చక్రవర్తి, టీ నటరాజన్‌, మయాంక్‌ యాదవ్‌, ఖలీల్ అహ్మద్‌ సహా మరికొందరు పేర్లను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రయోగాలకు వెళ్లే సాహసం చేయనున్నాడు.

Also Read: MS Dhoni: కొట్టేస్తా నిన్ను.. కెమెరామెన్‌ను బెదిరించిన ఎంఎస్ ధోనీ (వీడియో)!

ఇర్ఫాన్‌ పఠాన్ టీమ్‌ ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రింకు సింగ్, శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.