IPL 2024: నేటి నుంచి ధనాధన్ ఐపీఎల్ స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఇక, లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి. అయితే, తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా.. మే 26వ తేదీన ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు కప్ గెలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్ సాధించగా.. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల తలో ఒక్కసారి ట్రోఫీ దక్కించుకున్నాయి.

Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కాగా, చెపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు పాల్గొంటారు. ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు చూసేద్దాం.. తాజా సీజన్‌లో పలు టీమ్స్ కు కొత్త కెప్టెన్లు రాగా.. ముంబైకి హర్థిక్ పాండ్యా, హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్‌కు శుబ్‌మన్ గిల్ బాధ్యతలు తీసుకున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్ ఢిల్లీ, శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా జట్ల పగ్గాలను మళ్లీ చేపట్టారు. కాగా, మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజు శాంసన్ (రాజస్తాన్), పాఫ్ డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్‌లాగే ఈసారి కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.
అయితే, ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా.. ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడబోతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలిలో కాకుండా ముల్లన్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఛేంజ్ చేసుకుంది. అలాగే, ఈ సీజన్‌లో కొత్తగా రెండు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు వేసుకోవచ్చు.. ఇక, చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది అదనపు బలంగా పని చేయనుంది. ‘స్మార్ట్ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి ఐపీఎల్ లో అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే ఛాన్స్ ఉంది. అలాగే, టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమవుతుంది. గత సీజన్‌లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా కొనసాగనుంది. ఐపీఎల్ తర్వాత వెంటనే టీ20 ప్రపంచకప్ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ టోర్నీ ఒక మంచి అవకాశంగా భావించాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!