IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
- ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు
- తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బౌలర్లు
- ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Rules Change: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటర్లకు అధిక ప్రాధాన్యం లభిస్తుండగా.. బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ నిబంధనల్లో రెండు ప్రధాన మార్పులు అవసరమని కైఫ్ సూచించాడు.
‘మైదానాల పరిమాణాన్ని స్థిరంగా ఉంచాలి. ప్రస్తుతం కొన్ని స్టేడియాల్లో బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటర్లు సులభంగా భారీ షాట్లు ఆడుతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్‌లో 250-300 పరుగులు సాధారణంగా మారిపోయాయి. 150-170 వంటి స్కోర్లను కాపాడటం బౌలర్లకు దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే అన్ని మైదానాల్లో ఒకే విధమైన, కొంచెం పెద్ద బౌండరీలను ఉంచాలి. ఇది బౌలర్లకు కొంత వరకు న్యాయం చేస్తుంది’ అని మొహమ్మద్ కైఫ్ మొదటి మార్పుగా చెప్పాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఇక రెండో మార్పుగా.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తొలగించాలని కైఫ్ స్పష్టం చేశాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లు అదనపు బ్యాటర్‌ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. దీని వల్ల బౌలర్ల ప్రాముఖ్యత తగ్గిపోతోంది. అంతేకాకుండా ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోవడం కూడా దాని అవసరంపై సందేహాలు కలిగిస్తోంది. ఐపీఎల్‌లో ఈ నిబంధన వల్ల మ్యాచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో బౌలర్లకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కైఫ్ ఈ సూచనలు చేశాడు. భవిష్యత్తులో బీసీసీఐ ఈ అంశాలను పరిశీలించి మార్పులు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..