Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ ఔటా? నాటౌటా? ఇదిగో సాక్ష్యం!

Rohit Sharma Wicket Issue

Rohit Sharma Wicket Issue

IPL Released The Video Proof Of Rohit Sharma Dismissal That Had World Talking: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ వికెట్‌పై ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలుసు. రోహిత్ శర్మది న్యాయబద్దమైన ఔట్ కాదని, కీపర్ సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకడం వల్ల బెయిల్స్ కిందకు పడిపోయాయని, ఇది చాలా అన్యాయమంటూ సోషల్ మీడియాలో డిబేట్లు నడుస్తున్నాయి. అది ఔటేనని ఒక వర్గం వారు చెప్తుంటే.. కాదంటూ మరో వర్గం వారు వాదిస్తున్నారు. కనీసం రివ్యూ కూడా తీసుకోకుండా.. అలా ఎలా ఔట్‌గా నిర్ధారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైడ్స్, నో బాల్స్‌కి కూడా రివ్యూ చూస్తున్న ఈ రోజుల్లో.. రోహిత్ శర్మ ఔట్ అవ్వడానికి ఎందుకు మరోసారి పరిశీలించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి ముంబై ఇండియన్స్ క్యాంప్‌కి చెందిన వాళ్లు సైతం.. రోహిత్ వికెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సైడ్ యాంగిల్స్‌లో పరిశీలించి ఉంటే.. అది ఔటో, కాదో క్లారిటీగా తెలిసి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ.. ఏమాత్రం చెక్ చేయకుండా దీన్ని ఔట్‌గా ఖరారు చేయడం, నిజంగా అన్యాయమేనన్నారు.

RCB vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ

ఇలా నిన్నటి నుంచి రోహిత్ శర్మ వికెట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ అభిమానులు ఐపీఎల్ నిర్వాహకుల్ని నిందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఐపీఎల్ నిర్వాహకులు.. రోహిత్ శర్మ వికెట్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో సైడ్ యాంగిల్ నుంచి చూపించారు. ఇందులో రోహిత్ శర్మ ఔట్ అవ్వడానికి చాలా స్పష్టంగా చూడొచ్చు. నేరుగా బంతి తగలడం వల్లే.. బెయిల్స్ ఎగిరి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఇందులో సంజూ గ్లౌవ్స్ వికెట్లని తాకడం కాదు కదా.. అతడు ఒక అడుగు దూరంలో ఉండటాన్ని మనం క్లియర్‌గా గమనించవచ్చు. కాబట్టి.. రోహిత్ శర్మది అన్యాయమైన ఔట్ అని వచ్చిన కామెంట్లకు ఈ వీడియోతో చెక్ పడినట్టేనని చెప్పుకోవచ్చు. విడ్డూరం ఏమిటంటే.. ఈ వీడియో చూసి కూడా, కొందరు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. సంజూ తన కాలితో వికెట్లని తాకి, బెయిల్స్ పడిపోయేలా చేశాడంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఎవరేమన్నా సరే.. ఇది మాత్రం ఫెయిర్ వికెట్ అని ఈ వీడియోతో తేలిపోయింది. కాబట్టి, నో డిబేట్స్!

Mark Cuban: ఎలాన్ మస్క్‌కి ఫిట్టింగ్.. రోజుకి 1000 ఫాలోవర్లు పోతున్నారంటూ ఫిర్యాదు

Exit mobile version