Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli vs Travis Head: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య శుక్రవారం (మే 22న) ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానమే లక్ష్యంగా ఇరు జట్లు తలపడిన ఈ పోరులో ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు, టెన్షన్లు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
శివాంగ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఈ డ్రామా మొదలైంది. ఆ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ క్రీజులో ఉన్న బౌలర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఒకవైపు అయ్యర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుండగా.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ మిడ్-వికెట్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ వైపు చూస్తూ కొన్ని సైగలు చేశాడు. బ్రాడ్కాస్ట్ కామెంటేటర్ల ప్రకారం కోహ్లీ.. “నువ్వు వచ్చి కాస్త ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయవచ్చు కదా” అని హెడ్‌ను రెచ్చగొడుతూ మాట్లాడినట్లు అర్థమవుతోంది. ఆ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. అయినప్పటికీ కోహ్లీ మాత్రం హెడ్‌తో పదే పదే మాట్లాడుతూ, ఒకసారి బౌలింగ్ చేసి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అన్నట్లు సైగలు చేస్తూ, చివర్లో నవ్వుతూ చేత్తో వెళ్ళిపో అన్నట్లు హింట్ ఇచ్చాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కోహ్లీ అంత తీవ్రంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడుతున్నా.. ట్రావిస్ హెడ్ మాత్రం చాలా ప్రశాంతంగా, నవ్వుతూ సాధారణంగా స్పందించాడు. హెడ్ ఎప్పుడూ నోటికి కాకుండా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడానికి ఇష్టపడతాడనే విషయం ఈ మ్యాచ్‌లో మరోసారి రుజువైంది. అయితే, వీరిద్దరి మధ్య ఈ సరదా సంభాషణ ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ భారీ ఛేదనలో కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సకీబ్ హుస్సేన్ వేసిన బంతిని నేరుగా కవర్ ఫీల్డర్ చేతుల్లోకి కొట్టి కేవలం 15 పరుగులకే వెనుతిరిగాడు. ఆ తర్వాత మ్యాచ్ 18వ ఓవర్లో హెడ్ నిజంగానే బౌలింగ్‌కు వచ్చాడు. తను వేసిన రెండో బంతికే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ పడగొట్టడం విశేషం.
అయితే, కోహ్లీ కేవలం బౌలింగ్ చేయమని అడగడమే కాకుండా, హెడ్‌పై అసహనంతో ఉన్నట్లు మ్యాచ్‌లో కొన్ని చోట్ల కనిపించింది. ఫీల్డింగ్ పొజిషన్ మార్చుకునే క్రమంలో హెడ్ క్రీజు దాటి వెళ్తుండగా.. కోహ్లీ అతని వైపు చూస్తూ అసంతృప్తిగా కొన్ని మాటలు అన్నాడు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆర్సీబీ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు సాధించారు. అందులో ట్రావిస్ హెడ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ అవుట్ అయిన సమయంలో మైదానంలో ఉన్న కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్తున్న హెడ్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ, ఎగిరి గంతేస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
మైదానంలో కనిపించిన ఈ వేడి మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా తగ్గలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఆనవాయితీగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్న సమయంలో విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగా ట్రావిస్ హెడ్‌ను పూర్తిగా విస్మరించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇతర హైదరాబాద్ ఆటగాళ్లతో కరచాలనం చేసిన కోహ్లీ.. పక్కనే ఉన్న హెడ్‌ను మాత్రం అస్సలు పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!